Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేదల పాలిట ఆపద్భాందవుడు ...అందరివారని రైతు బంధు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన 8 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.3,86,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కనకమేడల సత్యనారాయణ, చండ్రుగొండ మండలం గుంపెన సొసైటీ ఉపాధ్యక్షులు నల్లమోతు వెంకటనారాయణ, అన్నపురెడ్డిపల్లి మండల టీఆర్ఎన్ నాయకులు వీరబోయిన వెంకటేశ్వర్లు, చండ్రుగొండ మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు వంకాయలపాటి బాబూరావు, యూత్ నాయకులు బడికెల శ్రావణ్ కుమార్, తిప్పన పల్లి మాజీ సర్పంచ్ గుగులోత్ రమేశ్, నయ్యద్ యాకూబ్, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు, రాజేశ్, కృష్ణప్రసాద్, హరీష్, భరత్ పాల్గొన్నారు.