Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో '21 సెంచ్యురీ ట్రాన్స్ఫారల్ స్కిల్స్' అంశంపై వర్క్‌షాపును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న అన్ని బ్రాంచీల విద్యార్ధులకు వారం రోజుల పాటు ఈ వర్క్‌షాపును నిర్వహించ నున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మార్క్ లూయిస్ హార్న్ ఈ వర్క్‌షాపులో శిక్షకులుగా వ్యవహరిస్తారన్నారు. బహుళ జాతీయ సంస్థల్లో కొలువులు సాధించేందుకు ఇంటర్వూ స్కిల్స్, టీం బిల్డింగ్‌పై విద్యార్ధులకు ఈ వర్క్‌షాపు ద్వారా అవగాహన కల్పించి వారిలో నైపుణ్యాలను మెరుగుపరుస్తారని తెలిపారు. విద్యార్ధులు క్రమం తప్పకుండా ఈ వర్క్‌షాపుకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. రాజ్యసభ సభ్యులు, కళాశాల ఛైర్మెన్, హెటెరో డ్రగ్స్ అధినేత బండి పార్ధసారధిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ సొసైటీ ట్రస్టీ బండి అన్విద మాట్లాడుతూ విద్యార్ధులకు, యాజమాన్యానికి వర్చువల్‌గా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్‌రెడ్డి, డైరెక్టర్ చెన్నుపాటి విజరుకుమార్, వివిధ విభాగాధిపతులు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఇంఛార్జి బత్తిని సంతోష్‌కుమార్, విద్యార్ధులు పాల్గొన్నారు.