Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
లక్ష్మిదేవిపల్లి మండలంలోని ప్రభుత్వ శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో సుమారు రూ.40 లక్షలతో నిర్మించిన లైబ్రరీ, సెమినార్ హల్ భవనమును కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని విద్యాలయాలకు అనేక మౌలిక వసతులు, సదుపాయాలు విద్యార్థిని, విద్యార్థులకు కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య సోనా, ఎంపీటీసీ భద్రమ్మ, సర్పంచ్లు కోరం చంద్రశేఖర్, భూక్య పద్మ, పడిగ ప్రశాంత్, ఉప సర్పంచ్ లగడపాటి రమేష్, టీఆరెస్ పార్టీ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, ఉర్దూఘర్ చైర్మన్ అన్వర్ పాషా, పునెం శ్రీను, ఐకె సత్యనారాయణ, కనకరాజు, కాలేజి ప్రీన్సిపాల్ హవేలి, కాలేజి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.