Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూలూరుపాడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రూ.కోట్ల ఖర్చు చేసినా రహదారుల్లో నాణ్యత లేకపోవడం వల్ల తీవ్ర వర్షాలకు రహదారులు పూర్తిస్థాయిలో గుంటలమయంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఆర్అండ్బీ అధికారులు స్పందించకపోవడం దారుణమని ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు పగడాల అఖిల్, ఎస్కే చాంద్ పాషా తెలిపారు. మంగళవారం ఏఐవైఎఫ్ మండల సమితి ఆధ్వర్యంలో గుంతల మయంగా మారిన రహదారిని పూడ్చారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి పసుపులేటి పవన్, వేణు, మధు, నరసింహారావు, వంశీ తదితరులు పాల్గొన్నారు.