Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ఎందరో నిరుపేద విద్యార్థులకు వారి కలలను సాకారం చేసుకొని వారి జీవిత లక్ష్యాలను సాధించడానికి హరిప్రియ ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థులకు నియోజక వర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ చేయూతనందిస్తున్నారు. అందులో భాగంగానే పోలీస్ స్టేషన్లో హౌంగార్డుగా విధులను నిర్వహిస్తున్న రాధారపు కృష్ణ వేణి కుమారుడైన ఏదులపురం సత్య ప్రసాద్ జెఎన్టీయు హైదరాబాద్ మెయిన్ క్యాంపస్లో మేటలార్జికల్ ఇంజనీరింగ్ కోర్స్ ప్రవేశానికి క్యాంపు కార్యాలయం రూ.10,000 ఆర్థిక సహాయాన్ని హరిప్రియ ఫౌండేషన్ ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, బయ్యారం వైస్ ఎంపీపీ, మండల అధ్యక్షుడు తాత గణేష్, పట్టణ ఉపాధ్యక్షుడు గుండా శ్రీకాంత్, పట్టణ ఇంచార్జ్ యలమద్ది రవి పాల్గొన్నారు.