Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షాకాలంలో మరింత పెరుగుదల
- బూజు పడుతున్న గెలలు
- ఆయిల్ శాతం పడిపోయే అవకాశం
- గెలలు ధర పై ప్రభావం
నవతెలంగాణ-అశ్వారావుపేట
అంతర్జాతీయ మారక ద్రవ్యం పెంపుతో పాటు దేశీయంగా ఆయిల్ అవసరాలను అధిగమించడానికి ప్రత్యామ్నాయ పంటలు సాగులో భాగంగా ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆయిల్ పాం సాగు విస్తరిస్తున్నా దీనికి తగ్గట్టుగా పరిశ్రమలు సామర్ధ్యం పెంచుకోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం 30 వేలు ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు అవుతుంది. ఇందులో 20 వేలు ఎకరాల్లో గెలలు దిగుబడి అవుతుంది. దిగుబడికి తగ్గట్టు పరిశ్రమలు సామర్ధ్యం పెంపుదల చేయకపోవడంతో గెలలు నిల్వ చేయడంతో సకాలంలో గానుగ ఇండికా పోవడంతో గెలలు బూజు పట్టి కుల్లుతున్నాయి. ప్రస్తుతం అశ్వారావుపేట, దమ్మపేటలో ఒక్కో ఆయిల్‌ఫెడ్ పరిశ్రమలు ఉన్నప్పటికీ వాటి సామర్ధ్యం పెంచలేదు. అశ్వారావుపేటలో పరిశ్రమను 5 టన్నుల సామర్ధ్యంతో 2006లో నిర్మాణం చేసారు. దమ్మపేట పరిశ్రమను 2017లో 60 టన్నులు సామర్ధ్యంతో నిర్మించారు. గెలలు నిల్వ చేయడానికి సైతం ప్లాంట్ ఫాంలు సరిపడా లేకపోవడంతో గెలలు దిగుమతి చేయడానికి వచ్చిన వాహనాలు ప్రధాన రహదారి పైనే నిలుపుతున్నారు. దీంతో సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం వారం రోజులపాటు ఫ్రూట్ హాలిడే ప్రకటించడంతో ఇప్పటికే పరిశ్రమకు తరలించిన గెలలు బూజు పడుతుండగా, తోటల్లో గెలలు రాలిపోతున్నాయి. మంగళవారం నాటికి పరిశ్రమలో 1600 టన్నులు గెలలు నిల్వ ఉన్నాయి. ఇవి గానుగ పట్టే సరికే మరో రెండు రోజులు సమయం పడుతుందని ఫ్యాక్టరీ మేనేజర్ బాలక్రిష్ణ తెలిపారు. నిల్వ ఉన్న గెలలుతో నూనే శాతం పడిపోయే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. నూనె శాతం పడిపోతే ఈ ప్రభావం గెలలు ధరపై పడే అవకాశం ఉందనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే చర్యలు చేపట్టాలి : రైతు సంఘ నాయకులు పుల్లయ్య
తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి గెలలు వెంటనే గానుగ ఆడాలని, నూనే శాతం పడిపోకుండా చూడాలని రైతు సంఘం నాయకులు పుల్లయ్య ఆయిల్ ఫెడ్ యాజమన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు.