Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలానికి రెగ్యులర్ ఎంఈఓని నియమించాలని తీర్మానం
- సీఐటీయూ
నవతెలంగాణ-చర్ల
నవంబర్ 1, 2వ తేదీల్లో సీఐటీయూ జిల్లా మహాసభలు భద్రాచలంలో జరుగుతున్నాయని ఈ మహాసభలు జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.పద్మ, జిల్లా ఉపాధ్యక్షులు కే.బ్రహ్మచారి పిలుపునిచ్చారు. మంగళవారం చర్ల మండలం సీఐటీయూ ఐదో మహాసభ రైతు వేదికలో జరిగింది. ఈ మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా కార్మికు ఉద్యమాలను మరింత ఉధృతం చేయడం కోసం మహాసభలు భద్రాచలంలో నిర్వహిస్తున్నామన్నారు. గ్రామపంచాయతీ వ్యవస్థలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాసే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో పర్మినెంట్ ఎంఈఓని నియమించాలని మహాసభ తీర్మానం చేసింది. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించా లని ఆశ వర్కర్లపై పని భారం తగ్గించాలని మహాసభ డిమాండ్ చేసింది. వీవోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని మహాసభ తీర్మానం చేసింది. ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా సీఐటీయూ మండల కమిటీ సభ్యులు విజయశీల, బాలాజీ వ్యవహరించారు. మహాసభలో కార్యక్రమాలు రిపోర్టును మండల కన్వీనర్ పాయం రాధాకుమారి ప్రవేశపెట్టారు. ఈ మహాసభలో వివిధ రంగాలకు సంబంధించిన నాయకులు పి.నాగమణి, నాగేంద్రమ్మ, సమ్మక్క కళ్యాణ్, విజరు, అనురాధ, కమల మనోహరి, పార్వతమ్మ, విజయలక్ష్మి, నాగమణి, సావిత్రి, సంపత్, సంజీవ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.