Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలంలో పొంగులేటి పర్యటన
- పర్ణశాల రామాలయంలో ప్రత్యేక పూజలు
నవతెలంగాణ -దుమ్ముగూడెం
ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం మండలంలో పర్యటించారు. ఆయన పర్యటన ఆద్యంతం, ఓదార్పులు, ఆత్మీయ పలకరింపులతో సాగింది. మండల పర్యటనలో భాగంగా ముందుగా ఆయన పర్ణశాల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన పర్ణశాల గోదావరి ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. అదే గ్రామంలో డయాలసిస్‌లో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్త గోసంగి కిరణ్ తండ్రిని పరామర్శించారు. గత నాలుగు రోజుల క్రితం కిడ్నీ ఫెయిల్యూర్లో చనిపోయిన గోవిందపురం గ్రామానికి చెందిన సవలం చంటి, వాగు ప్రమాదంలో మృతి చెందిన సీతానగరం గ్రామానికి చెందిన ఏనిక దుర్గమ్మ కుటుంబం పర్ణశాలలో-ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన పోడియం సుబ్బారావు, చిన్నబండిరేవు గ్రామానికి చెందిన అనారోగ్యంతో మృతి చెందిన చిరుతని బాబూరావు (నమస్తే తెలంగాణ) రిపోర్టర్ సత్యనారాయణ తండ్రి, తెల్లం నాగమణి, బాడిస నాగమల్లేష్ పెద్దనల్లబెల్లి-డయాలసితో బాధపడుచున్న రైతు బందు సమతి సభ్యుడు మట్టా అర్జున్ తండ్రి, ఇటీవల తాటి చెట్టు నుండి కిందపడి చనిపోయిన మట్టా రాముడు, చిన్ననల్లబెల్లిలో తాటి చెట్టు నుండి కింద పడిపోయి పక్కటెముకలు విరిగిన బొంబల్లి ఉపేందర్, బైక్ యాక్సిడెంట్లో నడుంవిరిగి మంచానికి పరిమితమైన పూసం చంటిబాబు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం సున్నం బట్టి-గోదావరి ముంపు ప్రాంతం పరిశీలించి విద్యుత్ షాక్‌తో మృతి చెందిన మద్ది ఆదిలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. బైరాగులపాడు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆశా కార్యకర్త, అనారోగ్యంతో బాధపడుతున్న దబ్బనూతల గ్రామానికి చెందిన తామ జోగారావు, అనారోగ్యంతో మృతి చెందిన సోందే సీతారాములు, కొత్తూరులో మృతి చెందిన పాయం చంద్రయ్య, దుమ్ముగూడెంలో-ఇటీవల అనారోగ్యంతో బాధపడుచూ వైద్యం చేయించుకుని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు అమ్మగారిని, లక్ష్మీనగరం-టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్.డి.రబ్బాని కుమారుడుని పరిశీలించిన అనంతరం లక్ష్మీనగరం-గోదావరి ముంపుకు గురైన కన్నాపురం, గంగోలు డబుల్ బెడ్ రూమ్ గ్రామాన్ని పరిశీలించారు. నందులచలక గ్రామంలో పక్షవాతంతో బాధపడుతున్న కల్లూరి లక్ష్మీపతి, సీతారాంపురం (దంతెనం)-ఇటీవల అనారోగ్యంతో మరణించిన బుయ్యన రాజశేఖర్ నర్సాపురంలో కొలగాని మాదవ్, పాత మారేడుబాక (నర్సాపురం)-ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టీఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్ భర్త మట్టా రాముడు, తూరుబాక (రెడ్డిపాలెం)-అంబటి లింగారెడ్డి, లక్ష్మమ్మ, అనారోగ్యంతో మృతి చెందిన కుమ్మరికుంట్ల రామకృష్ణల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు, ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ సీతమ్మ, భద్రాచలం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు, మండల అధికార ప్రతినిధి ఎం.డి జాని పాషా, దిశ సభ్యులు మట్టా వెంకటేశ్వరరావు, పర్ణశాల ఎంపీటీసీ తెల్లం భీమరాజు, రైతు నాయకులు సాగి శ్రీనివాస రాజు, తోట రమేష్, జోగా వెంకటరమణలతోపాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.