Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి ఖమ్మం జిల్లా సమన్వయ కర్తకు యాకూబ్ పాషా వినతి
నవతెలంగాణ-పాల్వంచ
మైనారిటీ గురుకుల నియామ కాలలో అర్హులైన వారికి అవకాశాలు కల్పించాలని మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా ఉమ్మడి ఖమ్మం జిల్లాల మైనారిటీ గురుకులాల సమన్వయ కర్త అరుణ కుమారిని కోరారు. మంగళ వారం కొత్తగూడెంలోని కలెక్టరేట్లో చేపట్టిన ఉద్యోగ నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆమెకు వినతి పత్రాన్ని అందించారు. నోటిఫికేషన్లో సూచించిన విద్యార్హత లకు భిన్నంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు సెలక్ట్ చేశారని, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లో చూపించి ఇంటర్వ్యూకు ఎవరిని పిలువలేదని, హౌస్ కీపింగ్‌లో మూడు ఉద్యోగాలను చూపించి కేవలం రెండు ఉద్యోగాలకు మాత్రమే అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారని, ఈ నెల 12న ప్రజల వాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అయినా నేటి వరకు ఫిర్యాదుపై అధికారులు స్పందించక పోగా ఆఘమేఘాల మీద మంగళవారం కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని ప్రజావాణిలో చేస్తున్న ఫిర్యాదులు సంబంధిత అధికారులు తుంగలో తొక్కుతున్నారని, ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా మైనారిటీ గురుకులాల సంస్థ రాష్ట్ర అధికారులు జిల్లాలోని మైనారిటీ గురుకులాల్లోని నియామకాల్లో జరుగుతున్న లోటు పాట్లను సరిచేసి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ నాయకులు హుసేన్ ఖాన్, షకీల్, తదితరులు పాల్గొన్నారు.