Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ డివిజన్, కొత్త మండలాలు, రైలు పునరుద్ధరణ చేయాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.రాజారావు
- దీక్షలకు సంఘీభావం తెలిపిన టీర్ఎస్, బీఎస్పీ
- సీఎం దృష్టికి తీసుకెళతాం మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మెన్లు
నవతెలంగాణ-ఇల్లందు
బ్రిటీష్ కాలం నాటి నుండి బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన, దేశానికి వెలుగులు నింపిన ఇల్లందు ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.రాజారావు అన్నారు. ఇల్లందును రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ అఖిలపక్ష ఆధ్వర్యంలో జగదాంబ సెంటర్లో చేస్తున్న దీక్షలు మంగళవారానికి రెండో రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి పి.రాజారావు హాజరై సంఘీభావం తెలిపి, మాట్లాడారు. చారిత్రకంగా ఇల్లందు ప్రాంతానికి ఎంతో పేరుందని అన్నారు. 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉండి, అపారమైన బొగ్గు నిక్షేపాలు వెలికితీసి విద్యుత్ శక్తికి దేశ ప్రగతికి దోహదపడుతున్న ప్రాంతమన్నారు. ఇల్లందును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని, బోడు కొమరారం సుధిమళ్ళలను మండలాలుగా ప్రకటించాలని, రైలును పునరుద్ధరణ చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు డిమాండ్లు సహేతుకమైనవి అన్నారు.
దీక్షలకు సంఘీభావం తెలిపిన టీఆర్ఎస్, బీఎస్పీ, టీడీపీ
సీఎం దృష్టికి తీసుకెళతాం మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు
దీక్షలకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ పాల్గొని సంఘీభావం తెలిపాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. మంత్రి అజరు కుమార్, ఎమ్మెల్యే హరిప్రియ కృషి చేస్తున్నారని అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తామని సమస్యలు ఖచ్చితంగా సాధిస్తామని అన్నారు. అనంతరం బీఎస్ప్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రతాప్, టీడీపీ పార్లమెంట్ కమిటీ మెంబర్ ముద్రగడ వంశీ, ప్రజా లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బట్టు శ్రీనివాస్, వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జ్ రాములు, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మెంబర్ దల్ సింగ్ నాయక్ దీక్షలకు సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షులు పులి సైదులు అధ్యక్షతన జరిగిన సభలో సాధన కమిటీ చైర్మన్ గుమ్మడి నర్సయ్య, సాధన కమిటీ కన్వీనర్ అబ్దుల్ నబి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దేవరకొండ శంకర్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు యాకయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ మండలాధ్యక్షులు పులి సైదులు, డానియల్, బీఎస్పీ, సీపీఐ మండల పట్టణ కార్యదర్శి బంధం నాగయ్య, ఉడుత ఐలయ్య, ప్రజాపంథా మండల కార్యదర్శి నాయిని రాజు, కొమరారం ఉప సర్పంచ్ పాల్గొన్నారు.