Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 400 మందిని పరీక్షించిన వైద్యులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
వైద్యారోగ్య శాఖ, ఐటీడీఏ భద్రాచలం సంయుక్తంగా మండల పరిధిలోని మలేరియా ప్రభావిత గ్రామం అయిన తిరుమలకుంటలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరం విజయవంతం అయింది. ఈ శిబిరాన్ని ఎంపీపీ శ్రీరామమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల సదుపాయాలను కలిగిస్తుందని, ఇందులో భాగంగానే వైద్యశిబిరాలు నిర్వహించినట్టు తెలిపారు. ఎంతో విలువ చేసే సుమారు 56 రకాల పరీక్షలు, పలువురు నిపుణులైన వైద్యులచే నిర్వహించడం హర్షించదగిన విషయం అన్నారు. అశ్వారావుపేట మండలానికి 108 అంబులెన్స్ ఆవశ్యకతను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన అయన జిల్లా వైద్యాధికారులను అంబులెన్స్ ఏర్పాటు చేయమని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఎంఅండ్‌హెచ్‌ఓ దయానంద్ అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సుమారు 400 మందిని కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రికి చెందిన స్త్రీల వైద్య నిపుణురాలు హారిక, జనరల్ ఫిజియన్ భావ్ సింగ్, పిల్లలు వైద్య నిపుణులు రాజేష్‌లు పరీక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సున్నం సరస్వతి, ఉప సర్పంచ్ జుజ్జురాపు రంబాబు, ఎంపీటీసీ నాగలక్ష్మి, ఐటీడీఏ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.