Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం గడ్డంపల్లి పంచాయతీలోని ఐలాపురం ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు ఎంపిక అయ్యారని పాఠశాల పీడీ ఆదినారాయణ తెలిపారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు కిన్నెర సాని, స్పోర్ట్స్ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి అటల పోటీలలో గెలుపొంది రాష్ట్ర స్థాయి అండర్-14, అండర్-17, పోటీలకు వాలీబాల్ విభాగంలో ఎం.సరిత, కె.రిస్పాని, టి.మైథిలి, సి.హెచ్.సింధు ఎంపికయ్యారని, ఖోఖో విభాగంలో పి.సరిత, టి.ప్రమీల, టి.మోహిని, సి.హెచ్.జ్యోతి, కె.చాందినీ, చెస్ విభాగంలో కె.జెనిలీయా, శ్యామల దేవి, ఎంపికయ్యారని ఈ విద్యార్థులు అందరూ ములుగు జిల్లా ఏటూరునాగారం జరిగే రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ భాయమ్మ, ఉపాధ్యాయులు పద్మ, శైలజ, వార్డెన్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.