Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సీతారామ' ప్రాజెక్టు ద్వారా మెరుగైన ప్యాకేజీ
- ఎకరానికి రూ. 10.50 లక్షల పరిహారం
- పోడు భూములకూ వర్తింపజేస్తాం: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
సీతారామ ప్రాజెక్టులో భూములు కోల్పోయే రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇప్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. మంగళవారం సత్తుపల్లి మండలం రేగళ్లపాడు, యాతాలకుంట, చెరుకుపల్లి గ్రామాల్లో జరిగిన పింఛన్లు పంపిణీ సభల్లో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులను ఇబ్బంది పెట్టబోమని, వారికి మెరుగైన ప్యాకేజీ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కంటే రూ. 2.50లక్షలు అదనంగా అందుతాయన్నారు. అంటే పక్క జిల్లాలో కేవలం ఎకరానికి రూ. 8లక్షల పరిహారం అందించారన్నారు. కాని మన ఖమ్మం జిల్లా రైతులకు రూ. 2.50 అదనంగా ఎక్కువ చేస్తూ ఎకరానికి రై. 10.50లక్షలు ఇప్పిస్తామన్నారు. పోడు రైతులకు ఇదే ప్యాకేజీ అందుతుందన్నారు. భూములిచ్చిన రైతులు అధైర్యపడొద్దన్నారు. 9, 10 ప్యాకేజీల ద్వారా యేడాదిన్నర కిందటే రూ. 700 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. యాతాలకుంట, రేగళ్లపాడు, బుగ్గపాడు, రుద్రాక్షపల్లి రైతులకు రావాల్సిన రూ. 36 కోట్లు త్వరలో అందుతాయయన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి, సీఎస్తో మాట్లాడటం జరిగిందన్నారు.
గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్...
గిరిజనులకు అభివృద్ధి పథొస్త్రం వైపు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి 10శాతం రిజర్వేషన్ను అమలు చేయనున్నారని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. మంగళవారం గిరిజన గ్రామాలైన రేగళ్లపాడు, యాతాలకుంట, చెరుకుపల్లి గ్రామాల్లో జరిగిన సభల్లో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. ఆసరా, కళ్యాణలోఈ్మ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సండ్రను గిరిజనం పూలవాన కురిపించింది.బతుకమ్మలతో ఊరేగింపు జరిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ దొడ్డా హైమవతి శంకరరావు, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, తహసీల్దారు వెంకటేశ్వరరావు, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు గాదె సత్యనారాయణ, యాగంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.