Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టియస్ యుటియఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని
నవతెలంగాణ - బోనకల్
గురుకుల, కస్తూర్బా గాంధీ బాలికల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గా భవాని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురుకులాలు, కేజీబీవీ పాఠశాలల్లో మంగళవారం టీఎస్ యుటిఎఫ్ సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గురుకుల, కేజీబీవి ఉపాద్యాయులకు హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని, కేర్ టేకర్స్ ను నియమించాలని, సిపియస్ విధానాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని, 2019లో నియామకమైన గురుకుల ఉపాధ్యాయులకు పిఆర్సి అమలు చేయాలని, వేతన వ్యత్యాసంలో వస్తున్న తేడాలను సరిచేయాలని, గెస్ట్, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుచేసి గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని కోరారు. బీసీ వెల్ఫేర్, కేజీబీవీ పాఠశాలల టైం టేబుల్ ను మార్పు చేయాలని కోరారు. గురుకుల, కేజీబీవీ పాఠశాలల్లో వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలని కోరారు. ఈ సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, బీసీ గురుకులాల రాష్ట్ర కో కన్వీనర్ లెవీన్, జిల్లా కన్వీనర్ అన్నం నాయుడు, టీఎస్ యుటిఎఫ్ మండల ఉపాధ్యక్షులు కంభం రమేష్, ఎంసిఆర్ చంద్ర ప్రసాద్, సద్దా బాబు, పసుపులేటి నరసింహారావు, పి.గోపాల్రావు పాల్గొన్నారు.