Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 శాతం రిజర్వేషన్‌తోనే గిరిజన అభివృద్ధి
- గంగదేవి పాడులో గిరిజన జాతర
నవతెలంగాణ-పెనుబల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్, పోడు భూములకు పట్టాలు శాసన సభలో ప్రకటించిన నేపథ్యంలో పెనుబల్లి మండలం గంగాదేవి పాడు గ్రామంలో గిరిజన జాతర ఢంకా మోగింది. గ్రామంలో సాంప్రదాయంగా గిరిజనులు జనాభా అధికం. గ్రామ కూడలి నుండి గిరిజనులు సాంప్రదాయ దుస్తులు ధరించి గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై పూలవర్షం కురిపిస్తూ మేళతాళాలతో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌తో పాటు, పోడు భూములకు పట్టాలు, రైతుబంధు మాదిరిగానే ఎకరానికి 10వేల రూపాయలు వచ్చేలా ముఖ్యమంత్రి కార్యాచరణ పూర్తి చేయనున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్కి మోకాలడ్డు తోందని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారానైనా రాష్ట్రంలో రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి ధృడనిశ్చయంతో ఉన్నారన్నారు.. కార్యక్రమంలో నాయకులు తేజావత్ తావునాయక్, భూక్యా పంతులి, నాయకులు చింతనిప్పు సత్యనారాయణ, చీకటి రామారావు, నీలాద్రి ఆలయ కమిటీ చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరావు, తాళ్లూరు శేఖర్ రావు, కనగాల వెంకటరావు, కొత్త గుండ్ల అప్పారావు,భూక్యా ప్రసాద్ , మందడపు అశోక్ కుమార్, కొప్పుల గోవిందరావు, బెల్లంకొండ చలపతి, తెలురి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.