Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి సబ్ జూనియర్ ఖోఖో రాష్ట్రస్థాయి పోటీలకు 30 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత క్రీడా ప్రాంగణంలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు.పోటీలకు జిల్లా నలుమూలల నుండి బాలికలు 62 మంది బాలురు 75 మంది పోటీల్లో పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కోకో జిల్లా జట్ల ఎంపికకు విశేషగా పోటీపడ్డారు అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులని బాలికల నుంచి 15 మందిని, బాలుర నుంచి 15 మందిని, ఎంపిక చేసి ఈనెల 28 29 30 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరిగేటటువంటి తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కోకో పోటీల్లో ఖమ్మం జిల్లా జట్టుని ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనటానికి సిద్ధం చేయడం జరిగింది. అలాగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనటానికి వెళ్లేటటువంటి 30 మంది క్రీడాకారులకు ఏకే డిజిటల్స్ అధినేత గూడూరు కోటిరెడ్డి రెండు జట్లకుకూడాను క్రీడా దుస్తులు అందించడం జరుగుతుంది. ఇక్కడకు వచ్చినటువంటి క్రీడాకారులకు అన్నిటిని కూడా పర్యవేక్షణను కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి మాధవరావు వ్యాయామ దర్శకులు టి లక్ష్మీనరసయ్య పర్యవేక్షించారు అలాగే కల్లూరు గ్రామ సర్పంచ్ లక్కినేని నీరజా రఘు వచ్చినటువంటి క్రీడాకారులకు క్రీడవస్తులు కల్పించడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. కార్యక్రమానికి తోడ్పాటు అందించినటువంటి తోపుడు బండి ఫౌండేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.కె సాదిక్ అలీ మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది.