Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ, అంగన్వాడీ అధికారుల చర్యలేవి
- ప్రశ్నించిన సొసైటీ అధ్యక్షుడు మూల్పూరి శ్రీనివాసరావు
- వెలవెలబోయిన మండల సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-ఎర్రుపాలెం
రెండు సంవత్సరాల లోపు వయసు కలిగిన చిన్నారులు ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారని, వారిని ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా ఎటువంటి ప్రయ త్నాలు చేశారు. ప్రైవేటు పాఠశాలలపై ఎటువంటి చర్యలు చేపట్టారో చెప్పాలని మధిర ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ శారద శాంతిని, మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్‌ని ఎర్రుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు మూల్పూరి శ్రీనివాసరావు ప్రశ్నించారు. మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ దేవరకొండ శిరీష అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు నిర్వహించారు. మూల్పురి శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు సిడిపిఓ సమాధానం ఇస్తూ మండల విద్యా శాఖ అధికారికి తెలియపరచామని అన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓతో మాట్లాడుతూ మండలంలో ఇద్దరు విద్యార్థులు 10కి 10% మార్కులు తెచ్చుకున్నారని, ప్రభుత్వ పాఠశాలలో ఆ ఇద్దరు విద్యార్థులు చదివి ఉంటే వారికి మంచి భవిష్యత్తు ఉండేదని, ప్రైవేటు పాఠశాలలో చదువుకోవడం వలన విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు.ప్రైవేట్ పాఠశాలలో చదు వుకుంటున్న ప్రీస్కూల్ విద్యార్థుల పైన దష్టి పెట్టి, విద్యాశాఖ అధికారులు, అంగన్వాడి అధికారులు చిన్నా రుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయు రాలిని వేరొక మండలానికి ఎలా పంపించారని ప్రశ్నించగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు పంపించడం జరిగిందని ఎంఈఓ తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీపీ శిరీష కలగజేసుకొని విద్యాశాఖ, అంగన్వా డి అధికారులతో ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యా సమస్యలను పరిష్కరించుకుందామని ఆమె అన్నారు.మండల పరిధిలోని నరసింహపు రం గ్రామపంచాయతీ సర్పంచ్ మెరుగుమల్ల లక్ష్మి గత వారం రోజుల నుండి జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన సమాచారం తెలియడంతో ఆమెకు సభ సంతాప సూచికంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశాన్ని యధావిధిగా నిర్వహించారు. మండల పరిధిలో 320 అగ్రికల్చరల్కి సంబంధిం చిన మీటర్లు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే రైతులకు అందించేలాగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. అర్హులైన వారికి నూతన రేషన్ కార్డులను కూడా ఇప్పించాలని సభ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి కరెంటు స్తంభాల సమస్య పెం డింగ్ లో ఉన్నాయని గ్రామపంచాయతీ సర్పంచులు ప్రతి సమావేశంలో ప్రస్తావిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మండల వైద్యాధికారి రాజు మాట్లాడుతుండగా బని గండ్లపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి కలగ చేసుకుని బనిగండ్లపాడు ప్రభుత్వ ఆస్పటల్ 30 పడకల ఆసుపత్రిగా కొనసాగుతుందని అది నేడు ఆరు పడకల ఆసుపత్రిగా మార్చారని తిరిగి 30 పడకల హాస్పటల్ గా మార్చాలని సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. మండల సమావేశానికి పలు శాఖల అధికారులు డుమ్మా కొట్టడంతో పలు సమస్యలు పరి ష్కరించకుండా పోయాయి. ప్రజా ప్రతినిధులు పరిమితంగానే రావడంతో సమావేశం హాలు వెలవెలపోయింది. పలు సమస్యలు చర్చించకుండానే సమావేశాన్ని ముగించారు. ఈ సమావేశంలో మండల అభివృద్ధి అ ధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ తాసిల్దార్ కరుణాకర్‌రెడ్డి, పలువురు శాఖ అధికారులు, గ్రామపంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సొసైటీ చైర్మన్ లు పాల్గొన్నారు.