Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య
నవతెలంగాణ - బోనకల్
ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదడ్రులకు పూర్తిస్థాయిలో నమ్మకం కలిగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సింగసారపు యాదయ్య ఉపాధ్యాయులను కోరారు. మండల పరిధిలోనే ముష్టికుంట్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలిన చలపతిరావు రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు అవార్డును పొందారు. అదేవిధంగా ముష్టికుంట గ్రామానికి చెందిన సయ్యద్ షఫీ రిక్క బజారు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును పొందారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ముష్టికుంట్ల ఉన్నత పాఠశాలలో పెద్ద ఎత్తున వీరికి అభినందన సభ నిర్వహించారు. ఈ అభినందన సభలో చలపతిరావుని, సయ్యద్ షఫీ ని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య మండల విద్యాశాఖ అధికారి మలినీడు ఇందిరా జ్యోతి పాఠశాల ఉపాధ్యాయ బందం, గ్రామస్తులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ షేక్ షాజహాన్ అధ్యక్షతన అభినందన సభ జరిగింది. ఈ సభలో అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బందం, సర్పంచ్ షేక్ బిజాన్ బి ఎంపీటీసీ భర్త పిల్లలమర్రి నాగేశ్వరరావు సిపిఎం, కాంగ్రెస్, టిఆర్ఎస్, సీపీఐ నాయకులు రిక్క బజార్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనపర్తి శ్రీనివాసరావు ఆయన మిత్ర బృందం తదితరులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముష్టికుంట్ల మాజీ సర్పంచ్ కొంగర వెంకటనారాయణ సిపిఎం నాయకులు పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, పిల్లల మర్రి వెంకట అప్పారావు, దొప్ప కొరివి వీరభద్రం, కందికొండ శ్రీనివాసరావు, షేక్ నజీర్, బూర్గుల అప్ప చారి, బొడ్డుపల్లి కోటేశ్వరరావు సిపిఐ నాయకులు జక్కా నాగభూషణం బిజెపి నాయకులు బోళ్ల బిక్షపతి టిఆర్ఎస్ నాయకులు బంధం శ్రీనివాసరావు, బంధం నాగేశ్వరరావు సొసైటీ అధ్యక్షులు బొడ్డ నాగేశ్వరరావు చిరునోముల బోనకల్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉమ్మ శెట్టి ఖాదర్ శ్రీనివాస్, వీ.రత్నకుమారి పాల్గొన్నారు.
చింతకాని : విద్యార్థుల్లో బోధనా శక్తిని పెంపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య పేర్కొన్నారు మండల పరిధిలోని తిమ్మినేనిపాలెం, తిరుమలాపురం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలిమెట్టు కార్యక్రమానికి సంబంధించి బేస్ లైన్ టెస్ట్ రికార్డులను తనిఖీ చేసి విద్యార్థుల ప్రగతిని ఆయన పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు పాఠశాలల్లోని రికార్డులు విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు మధ్యాహ్న భోజన తీరును పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు వడ్డించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులను ఆదేశించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య బిక్షం ఉపాధ్యాయులు సంక్రాంతి స్వాతి డేవిడ్ రాజు పాల్గొన్నారు.