Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంగళరావునగర్ సింగరేణి బ్లాస్టింగ్ బాధితులు
- జేవీఆర్ ఓసీ పీవో కార్యాలయం ఎదుట ఆందోళన
నవతెలంగాణ- సత్తుపల్లి
సింగరేణి బాంబు బ్లాస్టింగులతో దెబ్బతిన్న సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధి వెంగళరావునగర్‌లోని నివాస గృహాలకు పరిహారంగా రూ. 10లక్షలు చెల్లించాలని జేవీఆర్ ఓసీ బ్లాస్టింగ్ బాధితులు స్పష్టం చేశారు. మంగళవారం దెబ్బతిన్న ఇండ్లకు మరమ్మతులు చేపట్టేందుకు సింగరేణి పంపించిన సిమెంట్ పనుల సిబ్బందిని స్థానిక మహిళలు పెద్దఎత్తున జమకూడి అడ్డుకున్నారు. వారు తీసుకొచ్చిన సిమెంట్ బస్తాలను చిందరవందర చేశారు. అనంతరం పీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఆందోళనకు దిగిన వారితో పీవో వెంకటాచారి మాట్లాడారు. సింగరేణి సంస్థ దెబ్బతిన్న ఇండ్లకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేదన్నారు. దెబ్బతిన్న ఇండ్లను బాగుచేయించే కార్యక్రమాలే చేపట్టడం జరుగుతుందన్నారు. అయినా ఇది నా పరిధిలోది కాదని, మీ సమస్యను తమ సంస్థ పై అధికారుల దృష్టికి తీసుకుకెళ్లడం జరుగుతుందన్నారు. వెంగళరావునగర్‌లో ఆందోళనకు దిగిన వారిని సత్తుపల్లి ఎస్సై షాకీర్ సర్ది చెప్పారు. కాలనీలోకి మరమ్మతులంటూ ఎవరూ రావొద్దని, మరోసారి వస్తే కాలనీ ప్రజలు ఊరుకోరని ఎస్సైకు తెలిపారు.