Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఓఏల సమస్యల పరిష్కారం కోసం దశలవారి ఆందోళనలు
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అప్పారావు
నవతెలంగాణ-మణుగూరు
వీఓఏలకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి అప్పారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక శ్రామిక భవనంలో ఐకెపీ వీఓఏల జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వీఓఏల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దశల వారి ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. వారిని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతి కల్పించాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కణితి సులోచన, కార్యదర్శిగా వేణుగోపాల్, ఉపాధ్యక్షులు రామనర్సయ్య, సహాయ కార్యదర్శిగా తేర్ల స్రవంతి, కోశాధికారి రమేష్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎండీ చాందిని, జి.రోజా, పి.అరుణ, టి.లీలా, వి.స్వాతి, ధనలక్ష్మీ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షులు శ్రీనీవాసరావు, అధికసంఖ్యలో వీఓఏలు, తదితరులు పాల్గొన్నారు.