Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమాల ద్వారానే హక్కులు సాధించబడతాయి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, కనకయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి వ్యాప్తంగా 30 వేల మంది తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 12 రోజులుగా పట్టువిడవకుండా సాగిస్తున్న ఈ సమ్మెకు విప్లవ జేజేలు తెలియజేస్తున్నామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. మంగళవారం సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెపై యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ప్రజానీకాని కార్మిక వర్గాన్ని కలుపుకొని సింగరేణి స్తంభింప చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కరించడంలో సింగరేణి యాజమాన్యం, కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందారని, దొంగ నాటకాలు ఆడుతున్నాయని మండి పడ్డారు. ఇప్పటిక్తెన యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం వైపు ఆలోచన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి మాచర్ల సత్యం, ఏఐటియుసీ రాష్ట్ర నాయకులు దూమ్మలపాటి శేషయ్య, వంగావెంకట్ వీరాస్వామి, ఇప్టూ రాష్ట్ర కార్యదర్శి అనురాధ, నాయకులు జె.సీతారామయ్య, నాజర్ పాషా, సీఐటీయూ నాయకులు డి.వీరన్న, వై.వెంకటెశ్వరావు, కర్ల వీరస్వామి, ఐద్వా మహిళా సంఘం నాయకురాలు సందకూరి లక్ష్మి, తదితరులు పాల్గొని మద్దతు తెలుపుతూ మాట్లాడారు, జేఏసీ నాయకులు యర్రగాని కృష్ణయ్య, యస్డి.రాసుద్దిన్ పి.సతీష్, పిట్టల రామ్ చందర్, ఇనపనూరి నాగేశ్వరరావు, యల్.విశ్వనాధం, మల్లిఖార్జున్, జి.రమేష్, జి.శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.
బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన మహిళ కాంట్రాక్ట్ కార్మికులు
ఇల్లందు : వేతనాలు పెంచాలని కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మె మంగళవారానికి 12వ రోజుకు చేరింది. జీఎం ఆఫీస్ జెకె, కేఓసీ డ్రైవర్లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. కోల్ ట్రాన్స్ పోర్ట్, కార్మికులు మూడు గంటల పాటు బొగ్గు టిప్పర్లను ఆపి స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. పాత ఏజెంట్ ఆఫీస్ దగ్గర కాంటాక్ట్ కార్మికులు బతుకమ్మ ఆడి నిరసన తెలియజేశారు. కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు సీనియర్ న్యాయవాది సుంకర సత్యనారాయణ మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ సందర్భంగా కార్మికులకు జేఏసీ కృతజ్ఞ తెలియజేసింది. అనంతరం జేఏసీ నాయకులు తాళ్లూరికృష్ణ, షేక్ యాకూబ్ షావలి, నాగయ్య, టి.నాగేశ్వరరావు, కొండపల్లి శ్రీను పాల్గొని మాట్లాడారు. సమ్మె రోజురోజుకు బలపడుతుందన్నారు. ఈనెల 21న హైదరాబాదులో సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఉన్నందున సమావేశంలో కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచేవిధంగా కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు, గోపి, శివ, వేణు, జమున వెంకట భారు, కనకతార, మంజు, గంగ, తరుణ్, బలరాం పాసి, వెంకన్న, లింగమ్మ, రమేష్ తది తరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడి చేస్తాం : ప్రసాద్
మణుగూరు : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు శాసనసభ్యురాలు హరిప్రియలు కాంట్రాక్టు కార్మికుల సమ్మెలో భాగస్వామ్యం కాకపోతే వారి ఇండ్లను ముట్టడిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం కాంట్రాక్టు కార్మికుల 12వ రోజు సమ్మెకు మద్దతు ప్రకటించి మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్టు కార్మికులు 30 వేలు మంది 12 రోజుల పాటు సమ్మె చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం గానీ, సింగరేణి బెల్ట్ శానసభ్యులు స్పందించక పోవటం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ గోపాల్, ఆర్ లక్ష్మీనారాయణ, మున్నా లక్ష్మి కుమారి జంగం మోహన్ రావు, అక్కి నర్సింహారావు, దుర్గ్యాల సుధాకర్, సర్వర్, వీరస్వామి, అనురాధ, ఆవునూరి మధు, సురేందర్, జేఏసీ నాయకులు నాజర్ పాషా, నాగేశ్వరరావు, మధుసూదన్ రెడ్డి, గద్దల శ్రీనివాసరావు, మంగీలాల్, వీరభద్రం, పాషా తదితరులు పాల్గొన్నారు.