Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజక వర్గాల్లో 25 నుండి బతుకమ్మ చీరల పంపిణీ
నవతెలంగాణ-కొత్తగూడెం
నిరుపేద కుటుంబాల మహిళలు దసరా పండుగను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరెలు పంపిణీ చేపట్టినట్లు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో బతుకమ్మ చీరెలు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వరావుపేట శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరావు, కలెక్టర్ అనుదీప్, ఎస్సీ డాక్టర్ వినీత్, అటవీ అధికారి రంజిత్, ఐటిడిఏ పిఓ గౌతం, డిఆర్డీఏ పిడి మధుసూదన్ రాజులతో కలిసి మహిళలకు పంపిణీ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభ కానున్న బతుకమ్మ వేడుకలు సందర్భంగా నియోజకవర్గాల వారిగా అన్ని మండలాల్లో బతుకమ్మ చీరెలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. బతుకమ్మ చీరెలు పంపిణీ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి చీరెలు పంపిణీపై ఆయా మండల తహిల్దారులు అక్విటెన్సీ నివేదికలు అందచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ నవీన్ పాల్గొన్నారు.