Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఈవోకు యాజమాన్యాల వినతి
నవతెలంగాణ-సత్తుపల్లి
రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు 15 రోజులు దసరా సెలవులు ప్రకటించిందని, వాటిని వెంటనే కుదించి అకడమిక్ క్యాలెండర్లో పనిదినాలు పెంచాలని సత్తుపల్లి పట్టణంలోని పలు ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక ఎంఈవో కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాజమాన్యాల బాధ్యులు మాట్లాడుతూ కరోనా కారణంగా ఇప్పటికే విద్యార్ధులు నష్టపోయారని వాపోయారు. దానికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, పలు ఉత్సవాలకు సెలవులు వచ్చాయని, ఇప్పుడు కూడా 15 రోజులు సెలవులు ఇస్తే విద్యార్ధులు నష్టపోయే ప్రమాదముందన్నారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ సైతం సెలవులు తగ్గించాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం ఎంఈవో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వివిధ ప్రయివేటు స్కూలు యాజమాన్యాలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.