Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైయస్సార్ తెలంగాణ పార్టీ యోజనం మండలాధ్యక్షులు దూదిమెట్ల వెంకట్
నవతెలంగాణ- తిరుమలాయపాలెం
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై వనపర్తి పోలీసులు పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యువజన విభాగం పాలే డివిజన్ అధ్యక్షులు బానోత్ కిషోర్, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు దూదిమెట్ల వెంకట్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైయస్ షర్మిల చేపడుతున్న పాదయాత్ర అన్ని వర్గాల ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక అధికార పార్టీ నేతలు ఒత్తిడితో పోలీసుల చేత తప్పుడు కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.