Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
పిండిప్రోలు గ్రామ నివాసి, స్వాతంత్య్ర సమరయోధులు, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా సానుభూతిపరులు చామకూరి ఆగయ్య(93) అనారోగ్యంతో బాధపడుతూ, మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఆయన పార్థీవ దేహంపై పిండిప్రోలు గ్రామ సర్పంచ్, పార్టీ సీనియర్ నాయకులు రాయల నాగేశ్వరరావు పార్టీ అరుణ పతాకాన్ని కప్పి నివాళులర్పించారు. అలాగే, ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, పార్టీ డివిజన్ కార్యదర్శి సి వై పుల్లయ్యలు ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాప సానుభూతిని తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ మండల కార్యదర్శి కమ్మకోమటి నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ, చామకూరి ఆగయ్య ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ఉండి, దాని అభివృద్ధి కోసం కార్యకర్తగా పని చేశారని అన్నారు.