Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరా పట్టణ, రూరల్ మండలానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ చెక్కులను వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ పంపిణీ చేశారు. బుధవారం స్థానిక ఎన్విఎస్ ఫంక్షన్ హాలులో తహసీల్దార్్ నారపోగు అరుణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైరా ఎంపీపీ వేల్పుల పావని, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, మార్కెట్ చైర్మన్ బీడీ కే.రత్నం, మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మహమ్మద్, దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు వైరా మున్సిపల్ కమిషనర్ మరియు ఎంపీడీవో వెంకటపతి రాజు, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ మిట్టపల్లి నాగేశ్వరరావు, మునిసిపల్ కౌన్సిలర్ వనమా శ్వేశ్వరరావు, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్రావు పాల్గొన్నారు.