Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రిన్సిపాల్ మహమ్మద్ జకీరుల్లా
నవతెలంగాణ-గాంధీచౌక్
మండల రెవెన్యూ కార్యాలయం ఖమ్మం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్ అనుసంధానంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఆర్అండ్ బిజిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ మహమ్మద్ జాకీరుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండడం ఎంతో అవసరం అన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ రహీం, కంప్యూటర్ ఆపరేటర్ అజరు కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎన్.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.