Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
మండల పరిదిలోని లక్ష్మీపురం గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని బుధవారం సర్పంచ్ గుగులోత్ లక్ష్మి ప్రారంభించారు. పశువైద్యాధికారి కె.మమత ఆధ్వర్యంలో గర్భకోశ వ్యాధి చికిత్స 32 పశువులకు కృత్రిమ గర్భాధారణ 12 పశువులకు జనరల్ ట్రీట్మెంట్, 18 పశువులకు దూడలకు నట్టాల నివారణ టాబ్లెట్స్, ఇంజక్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్యలు కిషోర్ ఉమా కుమారి, రాకేష్, పశువైద్య సిబ్బంది రాధాకృష్ణ, నయీమ్ పాషా, సూపర్వైజర్ టి. వెంకటేశ్వర్లు, గోపాల్ మిత్రులు అప్పారావు పాల్గొన్నారు.