Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
మాటూరుపేట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో బుధవారం నిదానపురం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అనారోగ్యంతో ఉన్నవారికి మందులు పంపిణీ చేశారు. సర్పంచ్ బాధా కృష్ణారెడ్డి, సెక్రటరీ హరికృష్ణతో కలసి కాలనీలో గృహాలను సందర్శించి ప్రజలకు పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు శరత్ బాబు, భాస్కర రావు, ఏఎన్ఎం రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.