Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోని కలకోట గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైనట్లు కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బంధం నాగేశ్వరరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కిషోర్ కుమార్ ఎన్నిక పట్ల మండల కాంగ్రెస్ మండల కమిటీ హర్షం వ్యక్తం చేసిందని తెలిపారు. కిషోర్ కుమార్ ఎన్నిక పట్ల రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి, మధిర శాసనసభ్యులు, సిఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్కకి, డిసిసి అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్ కి మండల కాంగ్రెస్ కృతజ్ఞతలు తెలిపినట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ ఎంపీపీ గూగులలోత్ రమేష్, కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు, చిరునోముల సర్పంచ్ ములకారాపు రవి, ఉప సర్పంచ్ ఆముదాల పుల్లారావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మారుపల్లి ప్రేమ్ కుమార్, బీసీ సెల్ అధ్యక్షులు కందుల పాపారావు, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు నల్లమోతు సత్యనారాయణ, గూడ నరసయ్య శాస్త్రి పాల్గొన్నారు.