Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో స్థానిక 46వ డివిజన్ లో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు మున్సిపల్ సాధారణ నిధుల నుండి మంజూరయ్యాయి. నగర మేయర్ పునుకొల్లు నీరజ చేతుల మీద బుధవారం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ నీరజ మాట్లాడుతూ. ఖమ్మం నగరం హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ సహకారంతో త్రీ టౌన్ ప్రాంతం లోని గోళ్ళపాడు ఛానల్ ఆధునికీకరణ సాధ్యమైందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజారంజక మైన పాలన కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, కార్పొరేటర్ కన్నం వైష్ణవి, డి.ఈ శ్రీనివాస్,డివిజన్ నాయకులు కన్నం ప్రసన్న కృష్ణ, బొల్లేపల్లి విజరు, బాల్దె నాగేశ్వరరావు, తొగరు భాస్కర్, దేవర వెంకన్న, తుమ్మా సత్యనారాయణ, శనిగరం ఉప్పలయ్య, కన్నం రమేష్, గోధుమల శ్రీనివాసరావు పాల్గొన్నారు.