Authorization
Sun April 06, 2025 07:01:16 am
- జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్
నవతెలంగాణ-మధిర
నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి భరోసాగా మారిందని జడ్పీ చైర్మెన్ లింగాల కమల్ రాజు బుధవారం మధిర నిర్వహించిన సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అన్నారు. పట్టణ, మండల పరిధిలో మొత్తం 40 మంది లబ్ధిదారులకు రూ.13,44,500 లక్షల విలువ గల చెక్కులను జెడ్పీ చైర్మెన్ పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన అనంతరం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని పేర్కొన్నారు.