Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టియస్ యుటియఫ్, ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్
నవతెలంగాణ-గాంధీచౌక్
జెడ్.పి.జి.పి.ఎఫ్ స్లిప్పులను వెంటనే విడుదల చేయాలని, జి.పి.ఎఫ్ ఖాతాలని ఈ-పోర్టల్ లో ఉంచి, అప్డేట్ చేయాలని, లోన్లు, పార్ట్ ఫైనల్స్, ఫైనల్ పేమెంట్స్, క్లెయిమ్స్ చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని టిఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం టిఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా యూనిట్ జిల్లా పరిషత్ సిఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు జీ.వి. నాగమల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ జెడ్పిజిపిఎఫ్ స్లిప్పులను విడుదల చేయాలని కోరామని, అధికారులు స్పందిస్తూ 2020-21, 2021-22 సంవత్సరం స్లిప్పులు వెంటనే విడుదల చేస్తామని, ఇతర సమస్యలను త్వరలో పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు. నూతనజిల్లాల వారీగా జిపిఎఫ్ ఖాతాలను అప్డేట్ చేస్తున్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు బుర్రి వెంకన్న, వల్లంకొండ. రాంబాబు సురేష్ తదితరులు పాల్గొన్నారు.