Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మంలో విన్ఫీల్డ్ స్కూల్ 'బెస్ట్ స్కూల్ యూసింగ్ టెక్నాలజీ' అవార్డును కైవసం చేసుకున్నారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలన్ని మూతపడ్డాయి. దీంతో ప్రభుత్వం ఆన్లైన్ క్లాస్‌లకు పిలుపునిచ్చింది. ఆ సమయంలో ఆన్లైన్ ద్వారా లైవ్ క్లాసులను నిర్వహించడంలో 'విన్ఫీల్డ్' స్కూల్ తనదైన శైలిని చూపింది. విద్యార్థులకు పాఠాలను బోధించడంతోపాటుగా క్విజ్, వకృత్వ పోటీలు, ప్రతిభా పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులతో ప్రశంసలు అందుకున్నది. అంతేకాక జాతీయంగా విన్ఫీల్డ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డ్స్-2022లో అవకాశాన్ని దక్కించుకున్నది. న్యూఢిల్లీలో 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్'లో భాగంగా దేశవ్యాప్తంగా 100 పాఠశాలలకు అవార్డు అందజేయగా జిల్లా నుంచి విన్ఫీల్డ్ స్కూల్ 'బెస్ట్ స్కూల్ యూసింగ్ టెక్నాలజీ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డును ఎన్ఆర్డీసీ డిప్యూటీ డైరెక్టర్ ప్రీతిసింగ్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ లాజర్, ఎంబసీ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ సెరిబియా విన్ఫీల్డ్ పాఠశాల డైరెక్టర్లు గద్దె పుల్లా రావు, మన్నె కిశోర్‌కుమార్, పోలవరపు శ్రీకాంత్‌కు అందజేశారు. అవార్డు అందు కున్న పాఠశాల యాజమాన్యాన్ని పలువురు విద్యావేత్తలు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.