Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయిల్ ఫామ్ గ్రోవర్స్ సొసైటీ ప్రధాన
కార్యదర్శి మహశ్వర్ రెడ్డి
- ఖమ్మం జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం
నవతెలంగాణ-గాంధీచౌక్
ఆయిల్ ఫామ్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫామ్ గ్రోవర్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి తుంబూరు మహశ్వర్ రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, బండి శ్రీనువాసరెడ్డి, ఆళ్ళ నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. ఖమ్మం జాయింట్ కలెక్టర్ మధుసూదన్ ను ఆయిల్ ఫామ్ గ్రోవర్స్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం కలిసి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అప్పారావుపేట మరియు అశ్వారావుపేటలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ పరిధిలో గల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించారు. అప్పారావుపేట అండ్ అశ్వారావుపేట ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్ధ్యానికి మించి అధికంగా గెలులు రావడంతో ప్రతినెలా సెలవులు ప్రకటించడం పరిపాటిగా మారిందన్నారు. ఆంధ్ర ప్రాంతం నుండి ఈ ఫ్యాక్టరీలకు గెలలు రావడం వల్ల స్థానిక రైతులు నష్టపోతున్నారని, ఆంధ్ర ప్రాంత రైతులకు ఆయిల్ ఫెడ్ జారీచేసిన నకిలీ ఎఫ్ కోడ్ (గుర్తింపు కార్డు)ల వల్ల ఆంధ్ర ప్రాంత రైతులు, అక్కడ రేటు తక్కువగా వుండడం వల్ల వారి గెలలు ఇక్కడకు తీసుకువస్తునట్లు తెలిపారు. నకిలీ ఎఫ్కడ్ కార్డులపై రెవిన్యూ, అగ్రిక్చర్, హార్టికల్చర్ శాఖల వారి పర్యవేక్షణతో విచారణ జరిపించాలని కోరారు. రోజుల తరబడి ట్రాక్టర్లు / ఆటోలు / లారీలు సీరియల్లో వుండడంవల్ల వాహనాలు దెబ్బతినడమే కాకుండా గెలల ట్రాన్స్పోర్ట్ కు ఎవరూ తమ వాహనాలు కిరాయికి పెట్టడానికి ముందుకు రావడం లేదని, కూలీల కొరత తీవ్రంగా ఉందన్నారు. గత రెండు నెలల్లో దఫ దఫాలుగా మె.ట. 1కి రు. 9,000/- లు ధర తగ్గడం వల్ల రైతులు ఆర్ధికంగా నష్టపోతునట్లు చెప్పారు. అధికంగా వచ్చే గెలల వల్ల ఫ్యాక్టరీ రికవరీ పడిపోతుందని, రికవరీ ఆధారంగా ధర నిర్ణయించడం వల్ల రైతులకు నష్టం జరుగుతునట్లు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.