Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం ఆడపడుచులకు అందించే చీరలు ఖమ్మంనాకి చేరినట్లు అదనపు కలెక్టర్ ఎన్. మదుసూదన్ తెలిపారు. ఖమ్మం టీఎస్డబ్ల్యుహెచ్సీల్ గోదాముకు చేరుకున్న చీరలను బుధవారం అదనపు కలెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి విద్యాచందనతో కలసి పరిశీలించారు.
పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవమైన బతుకమ్మ పండుగకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో అందించే బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధమయ్యాయి. ఖమ్మం జిల్లాలో 18 ఏండ్లు నిండిన మహిళలు 5,03,668 మంది ఉండగా, ఇప్పటి వరకు జిల్లాకు 3, 03, 000 లక్షల చీరలు వచ్చాయి. మిగతా చీరలు రెండు రోజుల్లో రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా చీరల పంపిణీకి సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆదేశాల మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఈ పంపిణీని మంత్రి పువ్వాడ అజరు కుమార్ ప్రారంభించనున్నారు. బతుకమ్మ చీరల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అధికారులను మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ 18 ఏండ్లు పైబడి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని మంత్రి అజరు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతో పాటు, ఆడబిడ్డలకు ప్రేమ పూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన ఉభయతారక లక్ష్యంతో సీఎం కేసిఆర్ ఈ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు.