Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సర్పంచ్, ఉప సర్పంచ్ రాజీనామా
-కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం..
-ఎమ్మెల్యే సొంత ఇలాకాలో ఎదురుగాలి
నవతెలంగాణ-కరకగూడెం
అధికార టీఆర్ఎస్ పార్టీకి పినపాక నియోజకవర్గంలో ఎదురుగాలి వీచింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇలాకాలో సర్పంచ్, ఉప సర్పంచ్ సహా పలువురు పార్టీకి రాజీనామాలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. కరకగూడెం మండలం సమత్ బట్టుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పోలేబొయిన శ్రావణి, ఉప సర్పంచ్ ముడిగా సావిత్రి గురువారం టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పోలేబోయిన శ్రావణి మాట్లాడుతూ టీఆర్ఎస్ జెండా పట్టుకోవడానికి నాయకత్వం లేని రోజుల్లో చొరవ తీసుకుని పార్టీ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించానని అన్నారు. ఐదేండ్ల్ల పాలనలో తమకు నిరాశే మిగిలిందన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు దక్కడం లేదన్నారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవాన్ని చంపుకొని పార్టీలో కొనసాగలేనని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన పార్టీ పెద్దలకు, నాయకులకు ధన్యవాదాలు చెప్పిన ఆమె తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.