Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
స్థానిక శాసనసభ్యులు పొదెం వీరయ్య చేతుల మీదుగా భద్రాచలం పట్టణం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అదే విధంగా 63 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 విలువ గల చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, రెవెన్యూ సిబ్బంది, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరెళ్ల నరేష్, టిపిసిసి మెంబర్ బుడగం శ్రీనివాస్, బలుసు సతీష్, సరెళ్ల వెంకటేష్, రాగం సుధాకర్, నవీన్, ఉబ్బ వేణు తదితరులు పాల్గొన్నారు.