Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఈ ఏడాది బతుకమ్మ చీరలు పంపిణీని అశ్వారావుపేట జెడ్పీటీసి సభ్యురాలైన చిన్నంశెట్టి వరలక్ష్మీ స్వగ్రామం అయిన నారాయణపురంలో గురువారం ప్రారంభించారు. స్థానిక రైతు వేదికలో తహశీల్దార్ చల్లా ప్రసాద్ అధ్యక్షతన చీరలు పంపిణీని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సకల కులాలకు సమాన ప్రాతిపదికన సామాజిక న్యాయం కల్పిస్తోందని అన్నారు. ఈ ఏడాది దసరాకు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 రకాలు, 240 అద్దకాలలో, 800 రంగుల మేళ వింపులుతో రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారని ఆయన తెలిపారు. అలాగే మన అశ్వారావుపేట మండలంలో సుమారు 14,480 చీరలు వచ్చాయని, ఇంకా చీరలు వస్తాయని తెలిపారు. అలాగే ఇంకా ఎవరైనా ఆసరా పెన్షన్ రాని వారు ఉంటె మళ్ళీ దరఖాస్తు చేసుకోమని ఈ సందర్భంగా తెలిపారు.
అనంతరం అదే గ్రామానికి చెందిన మద్దాల రమణయ్య దళిత బంధు పథకంతో ఏర్పాటు చేసుకున్న మినీ సూపర్ మార్కెట్ ను ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స అనంతరం ఇంటివద్ద ఉంటున్న గుర్రాలచెరువు సర్పంచ్ కలపాల దుర్గయ్యను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సి.ఐ బాలక్రిష్ణ, ఎస్ఐ అరుణ, ఎం.డి.ఒ విద్యాధర రావు, ఎం.పి.ఇ.ఒ సీతారామరాజు, సర్పంచ్ కంగాల పరమేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపిటిసి సభ్యులు పాయం రమేష్, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, నారయణ పురం రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట నరసింహం, తెరాస అధ్యక్షకార్యదర్శులు బండి పుల్లారావు, జుజ్జూరపు వెంకన్న బాబు పాల్గొన్నారు.