Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ప్రభుత్వ విప్ రేగా కాంతారావును గురువారం కొత్తగూడెంలో దుమ్ముగూడెం టీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలు సమర్పిం చారు. పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు అన్నె సత్యాలు, కణితి రాముడు, ఎంపిపి రేసు లక్ష్మి, జడ్పిటిసి తెల్లం సీతమ్మలు రేగాను కలిసి ఈ ప్రాంత సమస్యలను వివరించారు. పోడు భూముల పట్టాలు, అంతర్గత రహదారుల నిర్మాణాల కోసం అభ్యర్థించారు. కొత్తపల్లి నుంచి గడ్డమడుగు వరకు, గోవిందాపురం నుంచి బక్క చింతలపాడు వరకు, ములకపాడు నుంచి లక్ష్మీపురం వరకు రహదా రుల నిర్మాణాల కోసం ఎల్డీఎఫ్ నిధులు మం జూరు అయ్యాయని రేగా తెలిపారు. పోడు సాగుదా రులకు ఎటువంటి ఆంక్షలు లేకుండానే ప్రతి కుటుంబానికి పదెకరాల వరకు పట్టాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందని, కొత్తగా పోడు ఎవరూ ధ్వంసం చేయవద్దని, ఎఫ్ఆర్సి కమిటీల నివేదికల ఆధారంగా పోడు లబ్దిదారులను గుర్తించడం జరుగుతుందని రేగా వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు తెల్లం భీమరాజు, సోడి తిరుపతిరావు, పార్టీ ప్రచార కమిటీ ఇంచార్జ్ దామెర్ల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జుంజురి జయసింహా, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు మోత్కూరి శ్రీకాంత్, విద్యార్థి విభాగం అధ్యక్షులు కొత్త మల్లేష్, నాయకులు మునీంద్ర తదితరులున్నారు.