Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హత ఉన్న సాగు రైతులకు పట్టాలు ఇవ్వాలి
- ఎఫ్ఆర్ఏ-2006 చట్టాన్నే అయుధంగా పట్టాల ప్రక్రియ చేయాలి
- తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుగులోత్ ధర్మా
నవతెలంగాణ-కొత్తగూడెం
సాగులో ఉన్న పోడు రైతులకు పట్టాలు ఇచ్చేదాక పోడు పోరాటం ఆగదని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుగులోత్ ధర్మా అన్నారు. గురువారం స్థానిక మంచికంటి భవన్లో జరిగిన కార్యమ్రంలో జీఓ-140 చెల్లుబాటు విషయంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైన తాజా పరిణామాల నేపధ్యంలో భానోత్ పోడు సాగు రైతుల అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఎఫ్ఆర్ఏ 2006 చట్టం నిర్ధేశించిన విధంగానే ప్రభుత్వ విధి విదానాలు ఉంటే పట్టాలు ఇచ్చేందుకు ఎటువంటి ఆటంకాలు అవరోధాలు ఉండవని తెలిపారు. ఈ సమావేశంలో బానోత్ లక్ష్మా, గుగులోత్ రాము, జర్పుల సక్రామ్, చీలాబాయి, హీరామన్, భానోత్ అచ్చమ్మ, దేవి, రాంబాబు, గుగులోత్ రాంబాయి, బీజాబాయి, చిన్న తదితరులు పాల్గొన్నారు.