Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలతో బతుకమ్మ ఆడిన మంత్రి పువ్వాడ బతుకమ్మ చీరెలు పంపిణీ
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు ఆడ పడుచులకు ప్రభుత్వం చీరెలను సారెగా అందించడం గర్వకారణమని, పువ్వులను పూజించే సంస్కతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. ముందుగా బతుకమ్మాలకు మంత్రి పువ్వాడ ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరెల పంపిణీలో భాగంగా గురువారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని శాంతినగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, నయా బజార్ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల, గట్టయ్య సెంటర్లోని ఫ్రీడమ్ పార్క్ లో మంత్రి పువ్వాడ అజరు కుమార్ చేతుల మీదుగా ఆడబిడ్డలకు చిరు కానుకగా బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, జిల్లా కలెక్టర్ వీ.పీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ కమిషనర్ మల్లేశ్వరి, ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా , మార్కెట్ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మక్బూల్, గజ్జెల లక్ష్మీ, పగడాల శ్రీవిద్య, ప్రశాంత లక్ష్మీ, ఆళ్ళ నిరిషా రెడ్డి, దాదే అమతమ్మ, మడూరి ప్రసాద్, మాతేటి అరుణ నాగేశ్వరరావు, తోట గోవిందమ్మ, పసుమర్తి రాంమోహన్, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.