Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. గురువారం కారేపల్లిలోని వైఎస్ఎన్ గార్డెన్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్‌ల పంపిణిని చేపట్టారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బంజారా భవన్, అధివాసీ భవన్ప్రారంభించిన సీఎం కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధును ప్రకటించి గిరిజన బంధువుగా మారారని కొనియాడారు. కారేపల్లి మండలంలో ఇప్పటి వరకు 1859 మందికి కళ్యాణలక్ష్మి షాదిముబాకర్ లబ్ధిదారులకు రూ.18.58 కోట్లు పంపిణి చేయటం జరిగిం దన్నారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాధిముబారక్ లబ్ధిదారులు 60 మందికి రూ.60.07లక్షల విలువైన చెక్‌లను పంపిణి చేశారు. తొడితలగూడెంలో అసరా పెన్షన్ లబ్ధిదారులకు కార్డులను సర్పంచ్ బానోత్ కుమార్, ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్‌తో కలిసి పంపిణి చేశారు. కారేపల్లిలో ఇటివల గుండెపోటుతో మృతి చెందిన ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ సోదరుడు కొండబాల వెంకయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే సందర్శించి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. కుటుంబానికి సానుభూతిని తెలిపారు. ఈకార్యక్రమాల్లో టీఎస్ మార్కెఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొర్ర రాజశేఖర్, ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారయణ, ఎంపీపీ మావోత్ శకుంతల జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సోసైటీ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దారావత్ మంగీలాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష ఫ్రదాన కార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న పాల్గొన్నారు.