Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లిరూరల్
అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని రామగోవిందపురం, ప్రకాష్‌నగర్ గ్రామాల్లో సొంతింటి స్థలం లేని పేదలతో జనరల్ బాడీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ..ఇంటి స్థలం లేని పేదలకు ఇంటి స్థలం ప్రభుత్వం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి రూ 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలయాపన చేస్తే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి గుడిసెలు వేసుకోవడానికి పేదలు సిద్ధంగా వున్నారని, అటువంటి అర్హులైన పేదలకు అండగా సీపీఐ(ఎం) అండగా ఉంటుందన్నారు. సమావేశంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు, త్రిమూర్తులు, నాగరాజు, నారాయణరవు, నాగలక్ష్మి, దుర్గ, రాంబాబు, సరోజినీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.