Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
- రాష్ట్రంలో రాజకీయాలకతీతంగా సంక్షేమ ఫలాలు
- ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు
- 24 గంటలు అందుబాటులో ఉంటున్నా ఆదరించండి
- పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
నవతెలంగాణ- నేలకొండపల్లి
తెలంగాణ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి భావితరాల భవిష్యత్తుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామరక్ష అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మండలంలోని ముజ్జుగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ను ప్రారంభించి, కట్టుకాచారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న బీటీ రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేసి వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అంతకుముందు గువ్వగూడెం గ్రామంలో 13 కిలోమీటర్ల మేర 17 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రింగ్ రోడ్డు నిర్మాణానికి ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అనంతరం నాచేపల్లిలో నూతనంగా నిర్మించనున్న రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి రైతు వేదికను ప్రారంభించారు. కొంగర, చెరువుమాదారం, మండ్రాజుపల్లి, సుర్దేపల్లి, రాజేశ్వరపురం గ్రామాలలో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా గువ్వలగూడెం గ్రామంలో ప్రజలు వారికి ఘనస్వాగతం పలికారు. ముజ్జుగూడెం గ్రామంలో జరిగిన సభలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని చెప్పడానికి ముజ్జుగూడెం గ్రామంలో చేపట్టిన సబ్ స్టేషన్ల ఏర్పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలే ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. రైతులకు ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రధాని మోడీ విద్యుత్తును ప్రైవేటుపరం చేసి రైతుల మోటార్లకు మీటర్లు బిగించి రైతులను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మోడీ విద్యుత్ సంస్కరణలు అమలు జరిగితే 20 లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అందుకు ప్రజలంతా అండదండగా ఉంటూ ఆశీర్వదించాలని కోరారు. ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఓట్లనాడే మాత్రమే రాజకీయాలని, అనంతరం రాజకీయాలకతీతంగా రైతులు, ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. గువ్వలగూడెం గ్రామంలో జరిగిన సభలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ 24 గంటలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నానని, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నానని తెలిపారు. గ్రామంలో కొన్ని అరాచక శక్తులు అభివృద్ధిని ఆటంకపరిచేలా చిల్లర రాజకీయాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని, రానున్న కాలంలో వారి చిల్లర రాజకీయాలకు అడ్డుకట్ట వేస్తామని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, రైతుబంధు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, ఎంపీడీవో కే జమలారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజ్జిగూడెం గ్రామ సర్పంచ్ ఉన్నం బ్రహ్మయ్య, రైతుబంధు సమన్వయ సమితి మండల కన్వీనర్ శాఖమూరి సతీష్, సి డి సి చైర్మన్ నెల్లూరి లీలా ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ నెల్లూరి శాంత, ఎలక్ట్రిసిటీ ఎస్సీ సురేందర్, సర్పంచులు వంగూరి వెంకటేశ్వర్లు, మందడి రాజేష్, ఈఊరి సుజాత, నెల్లూరి అనురాధ, తోళ్ళ వెంకటేశ్వర్లు, దండ పుల్లయ్య భూక్య సుధాకర్, సొసైటీ చైర్మన్ తన్నీరు సత్యనారాయణ, నాగుబండి శ్రీనివాసరావు, అనంతు కాశయ్య, పగిడిపత్తి శ్రీను, పార్టీ మండల కార్యదర్శి వెన్నపోయిన శ్రీను పాల్గొన్నారు.