Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి వైయస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చటాన్ని టిడిపి మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడిపి మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగువారి ప్రభుత్వాలు మారినప్పుడల్లా యూనివర్సిటీల పేర్లు మార్చటం ప్రజాస్వామ్యంలో అనైతికమని, ఉమ్మడి రాష్ట్రంలో పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పనిచేసినా, ఇలాంటి దుశ్చర్య లకి పాల్పడలేదని అన్నారు. ఒంటెద్దు పోకడపోయే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో తూటికుంట్ల ఉపసర్పంచ్,మండల ఉపాధ్యక్షుడు తుళ్లూరి కొండలరావు, మండల కార్యదర్శి మరీదు బరకయ్య, రాష్ట్ర గిరిజన సంఘ నాయకుడు బానోతు శివల నాయక్, టీఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు బంధం అనిల్ కుమార్, మండల కార్యదర్శి బండి రామారావు, రావినూతల గ్రామ శాఖ కార్యదర్శి చిత్రాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.