Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
నగరంలోని విడిఓస్ కాలనీలో గల సర్వజ్ఞ పాఠశాలలో గురువారం మమత దంత కళాశాల దంత వైద్య బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ ఆర్వి. నాగేంద్రకుమార్ శిబిరాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ మనిషి శరీరంలో దంతాలు కూడా ముఖ్యభాగమనే అంశంపై విద్యార్థుల్లో అవగాహన కల్పిచేందుకు, దంత సమస్యలు వాటి నివారణపై వైద్యులు సలహాలు, సూచనలు తెలియజేసేందుకు ప్రతి ఏటా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్‌లు, ఐస్‌క్రీమ్‌లు దంతాలకు హానికలిగిస్తాయని తెలిపారు. రోజు రెండు పూటలా బ్రస్ చేసుకోవడం అలవర్చుకోవాలని సూచించారు. చదువుతోపాటు ఆరోగ్య కరమైన విషయాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇటువంటి వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో వైద్యకళాశాల ఆచార్యులు అనిత, వేణుగోపాల్, మాధవి సద్మ, శివకళ్యాణి, పాఠశాల డైరెక్టర్ నీలిమ, ప్రిన్సిపాల్ కె.మానస, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.