Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
పేదలకు భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక నందు మండల పరిధిలోనే వివిధ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గురువారం కమల్రాజు పంపిణీ చేశారు. 33 మంది లబ్ధిదారులకు రూ.11,38,000 లక్షల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు కమల్రాజు తెలిపారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మండల ప్రధాన కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ జంగా రవికుమార్, మాజీ జెడ్పిటిసి బనావత్ కొండ, రైతుబంధు మండల కన్వీనర్ వేమూరి ప్రసాదరావు, నాయకులు కరివేద సూర్యదేవర బాబు, కేతినేని నరసింహారావు, గొడుగు కృష్ణ, కాకాని శ్రీనివాసరావు, యార్లగడ్డ రాఘవరావు, రామాపురం ఎంపీటీసీ ముక్కపాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.