Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో ఖమ్మంలో జరిగే రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం బోనకల్ మండల నాయకులు గురువారం గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం పట్టణంలో జరుగుతున్న గడపగడప ప్రోగ్రాం కార్యక్రమంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు 5వ టౌన్ అధ్యక్ష కార్యదర్శులు భాగం అజిత, ఎస్.కె బేగం సిపిఎం మండల కమిటీ సభ్యులు తుళ్లూరు రమేష్, గుగులోత్ నరేష్, బంధం శ్రీనివాసరావు, మందడపు శ్రీనివాసరావు, కొమ్మినేని నాగేశ్వరరావు, గుడ్డూరి ఉమ, దొప్ప కురివి వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కర్లకంఠ ముత్తయ్య, కొమ్మినేని సీతారాములు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర మహాసభల్లో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరరు విజయన్ పాల్గొననున్నట్లు తెలిపారు. ఖమ్మం పట్టణ కేంద్రంలో లక్షలాది మందితో జరగనున్నట్లు వారు తెలిపారు. ఈ బహిరంగ సభలో వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.