Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
రాష్ట్రంలో గిరిజన, దళిత కూలీలను యజమానులుగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆదివాసీ రాష్ట్ర సర్పంచ్ల ప్రచార కార్యదర్శి, మర్కోడు గ్రామ సర్పంచ్ కొమరం శంకర్ బాబు అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివాసీ ముద్దు బిడ్డగా నియోజకవర్గంలోని ప్రతి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైన పోడుభూములు, రోడ్లతో పాటు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని తెలిపారు. గిరిజనుల ప్రధాన సమస్య పోడు భూములకు పట్టాలు సీఎం 140 జీవో ద్వారా ఇవ్వనుండటం ఆమోదయోగ్యమైన పరిష్కారమని చెప్పారు. నియోజకవర్గంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఎల్ డబ్ల్యు ఇ నిధులు రూ.75 కోట్లు మంజూరు చేపించడంలో ఎమ్మెల్యే కషి ఎంతో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి పథకంతో అన్ని పాఠశాలల్లో మరమ్మతులు, విద్యుత్ సరఫరా, తదితర సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో గిరిజనులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్లు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.